ప‌వ‌న్‌.. నీకంటూ ఓ క్లారిటీ ఉందా? జ‌న‌సేనాధిప‌తికి బొత్స సూటి ప్ర‌శ్న‌

ఏపీ టాప్ న్యూస్‌:“ జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వ‌య‌సు పెరుగుతుందికానీ బుద్ధి పెర‌గ‌డం లేదు. అందుకే ఆయ‌న‌ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయ‌న‌కంటూ ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అస‌లు ఆయ‌న‌లో విష‌య‌మే లేదు. అంతా డ‌ప్పా“ అంటూ విమ‌ర్శించారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. మొన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కులం గురించి, ఆయ‌న మ‌గ‌త‌నం గురించి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడ‌డంపై వైసీపీ నేత‌లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ త‌ల ఎక్క‌డ పెట్టుకుంటావ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు ప‌వ‌న్ క‌ల్యాణ్‌లో అస‌లు విష‌య‌మే లేదంటూ బొత్స స‌త్యానారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌శ్నించ‌డానికే వ‌చ్చాన‌ని చెబుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ పెట్ట‌డం ఎందుకు ఒక స్వ‌చ్ఛంద సంస్థ పెట్టుకుంటే స‌రిపోతుంది క‌దా అని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్లారిటీ లేద‌ని, అవ‌గాహ‌న లేద‌ని, ఏది ప‌డితే అది మాట్లాడుతున్నార‌ని, ఇలాగే ముందుకెళ్లితే ప్ర‌జ‌లు బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రిస్తున్నారు.

“త‌న‌కు కుల‌పిచ్చి లేదంటాడు.. అంత‌లోనే ఫేవ‌రేట్ కులం ఒక‌టుందంటాడు. త‌న‌కు ప‌ద‌వుల‌పై ధ్యాస లేదంటాడు.. అంత‌లోనే త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని, ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను అడుగుతాడు. అత‌నికి కుల‌పిచ్చి, అధికార కాంక్ష మెండుగా ఉన్నాయి“ అని బొత్స విమ‌ర్శించారు. త‌న‌లో విష‌యం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తెల‌స‌ని, అందుకే ఆయ‌న పెద్ద పెద్ద పుస్త‌కాలు చ‌దువుతున్న‌ట్లుగా ఫోటోలు పెడుతుంటార‌ని, అందులోని కోట్స్ రాస్తుంటార‌ని చెప్పుకొచ్చారు.అయితే త‌మ నాయ‌కుడిని కానీ, త‌మ పార్టీని కానీ విమ‌ర్శించే అర్హ‌త ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు లేద‌ని, ఇంకెప్పుడైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ నోరు పారేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోమ‌ని ప‌వ‌న్‌ను బొత్స హెచ్చ‌రించారు.

Share