రోజుకో మాట‌..పూట‌కో అబ‌ద్ధం ఇదే చంద్ర‌బాబు నేర్చుకున్న రాజ‌కీయం

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాల్లో చాలా అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా, ముఖ్య‌మంత్రిగా ఎక్కువ కాలం ప‌నిచేశారు. దేశంలోనే త‌నంత సీనియ‌ర్ నాయ‌కుడు లేర‌ని ఆయ‌న చెబుతుంటారు. అయితే ఇంత అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు రాజ‌కీయాల్లో నేర్చుకున్న‌ది ఏంటంటే రోజుకో మాట మాట్లాడ‌డం..పూట‌కో అబ‌ద్ధం చెప్ప‌డం ఇదే ఆయ‌న నేర్చుకున్న రాజ‌కీయం. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉంటూ ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నారు. గ‌తాన్ని మ‌రిచిపోయి మాట్లాడుతున్నారు. నాలుగేళ్ల‌కు పైగా బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు ఆ పార్టీని తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. కొత్త‌గా జ‌త‌క‌ట్టిన కాంగ్రెస్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడే పార్టీ టీడీపీనే అంటూ పాడిన పాటే పాడుతున్నారు. విశాఖ‌జిల్లా ఉత్త‌రాంధ్ర సుజ‌ల శ్ర‌వంతి ప్రాజెక్టు ఫేజ్ 1 శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్రబాబు ఏమ‌న్నారంటే…

“మ‌నం ఎన్టీఆర్ వారసులం. భ‌యానికి భ‌య‌ప‌డం. నిస్వార్థంగా ప‌నిచేస్తాం. తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడ‌తాం. దేశం ఇబ్బందుల్లో ఉంది కాబ‌ట్టే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. మోడీకి అవ‌గాహ‌న లేదు. పెద్ద నోట్లు ర‌ద్దు వ‌ల్ల చాలా న‌ష్టం జ‌రిగింది“ అంటూ చెప్పుకొచ్చారు. అయితే బాబు వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌నులు, రాజ‌కీయ విశ్లేష‌కులు మండిప‌డుతున్నారు. చంద్రబాబు నాయుడు ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు బాబు..మోడీ  అభివృద్ధి జోడి అని అన్న‌ది, మోడీ వంటి ప్ర‌ధాని ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ రాలేద‌ని, ఇక‌పై కూడా రాడ‌ని, దేశం అభివృద్ధి వైపు దూసుకుపోతోంద‌న్న‌ది ఎవ‌రూ ఇంకా మ‌రిచిపోలేద‌ని అంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ వార‌సులు తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడ‌తారా?  తాక‌ట్టు పెడ‌తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. పెద్ద‌నోట్లు నేను చెబితేనే మోడీ ర‌ద్దు చేశార‌ని మీడియాముఖంగా చెప్పిన విష‌యాలు మ‌రిచిపోయారా చంద్ర‌బాబుగారూ అంటూ గుర్తుచేస్తున్నారు. దేశం క‌ష్టాల్లో ఉంది అంద‌కే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నామ‌ని చెబుతున్నా మీరు భార‌త‌దేశం క‌ష్టాల్లో ఉందా?  తెలుగుదేశం క‌ష్టాల్లో ఉందా? అన్న‌ది కూడా చెప్పాల‌ని అడుగుతున్నారు. మ‌రీ ఇంత ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్న మీకు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని నెటిజ‌నులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో బాబు గ‌తంలో అన్న వీడియోల‌ను పెడుతూ వైర‌ల్ చేస్తుండ‌డం విశేషం.

 

Share