కాంగ్రెస్ మూడ‌వ జాబితాలో పొన్నాల‌కు టిక్కెట్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. జ‌న‌గామ సీటు ఎవ‌రికో తెలిసిపోయింది. జ‌న‌గామ నుంచి పోటీ చేయాల‌నుకున్న టీజేఎస్ అధినేత కోదండ‌రామ్‌కు కాంగ్రెస్ పార్టీ న‌చ్చ‌చెప్ప‌డం, పొన్నాల‌కు సీటు ఖ‌రారు చేయ‌డం జ‌రిగింది పోయింది. కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసిన మూడ‌వ జాబితాలో ఇంకా ఎవ‌రెవ‌రికి సీట్లు ఖ‌రారు అయ్యాయి అనే వివ‌రాల్లోకి వెళ్లితే… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల లక్ష్మయ్య కు టిక్కెట్ ల‌భించింది. ఆయనతో పాటు ఎల్బీన‌గ‌ర్‌ సీటును సుదీర్ రెడ్డికి, తుంగతుర్తి సీటు అద్దంకి దయాకర్‌కు కేటాయించారు. ఇల్లందును హరిప్రియ నాయక్ కు ఇచ్చారు. బోద్ ను సోయం బాపూరావు, బాల్కొండ సీటును అనిల్ కుమార్ కు ఇచ్చారు. నిజామాబాద్ టిక్కెట్ తాహిర్ బెన్ కు, నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ను భూపతి రెడ్డికి ఇచ్చారు. కార్వాన్ హజ్రీ, కొల్లపూర్ -హర్షవర్దన్ రెడ్డి, దేవరకొండ- బాలూ నాయక్ కు ఇచ్చారు. మరో ఆరు టిక్కెట్లు పెండిగులో ఉన్నాయి.

Share