నాపై హ‌త్యాయ‌త్నం కుట్ర‌కు బీజం వేసిందే చంద్ర‌బాబు: జ‌గ‌న్‌

ఏపీ టాప్ న్యూస్‌: “నాపై హ‌త్యాయ‌త్నం కుట్ర‌కు బీజం పేసిందే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు“అని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టులో హ‌త్యాయ‌త్నం దాడి త‌ర్వాత మొద‌టి సారిగా పార్వ‌తీపురం బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు నాయుడు త‌డిగుడ్డ‌తో గొంతులు కోసే ర‌క‌మ‌న్నారు. తన పాదయాత్ర మహోద్యమ రూపం దాల్చుతున్న సందర్భంలో దీనిని నిలుపుదల చేయాలని భావించి త‌న‌పై హ‌త్యాయ‌త్నం ప్రయత్నం చేశార‌న్నారు. గత మార్చిలో ఆపరేషన్ గరుడ అన్నదానిని తెరపైకి తెచ్చారని, చంద్ర‌బాబుకు సన్నిహితుడు అయిన సినీ నటుడుతో ప్రెస్ మీట్ పెట్టించి ,దానిని ఎల్లో మీడియా లో ప్రచారం చేయించార‌ని, చంద్ర‌బాబు చెప్పిన స్క్రిప్ట్ ప్ర‌కారం క‌థ‌ను న‌డిపించార‌న్నారు.
విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టు లో రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి వద్ద పనిచేసే వ్యక్తి కత్తి తో త‌న‌పై హత్యా యత్నం చేయించార‌ని, తనపై హత్యాయత్నం జరిగిన గంటలోనే డిజిపి,హోం మంత్రి, మంత్రులు చంద్రబాబు రాసిన స్క్పిప్ట్ చదివార‌న్నారు. ఎయిర్ పోర్టులో జ‌రిగితే త‌మ‌పైకి ఏమీ రాద‌ని కుట్ర ప‌న్నార‌న్నారు. దాడి చేసిన వ్య‌క్తితో తాను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని అని బ‌ల‌వంతంగా చెప్పించార‌న్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గొప్పగా పని చేయాలనుకునే వ్యక్తి హత్యాయత్నం చేస్తారా? అని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం దాడికి సంబంధించి స్వతంత్ర్య ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ చేయించ‌మంటే చంద్ర‌బాబు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని నిల‌దీశారు.

చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు ప్ర‌జాసేవ‌లోనే ఉంటా
తాను చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. ముప్పై ఏళ్లపాటు ప్రజలు గుర్తుంచుకునేలా, తన తండ్రి పక్కన తన పోటో కూడా ఉండేలా పాలన చేయాలన్నది తన అబిమతమని జగన్ అన్నారు.కుట్ర కోణం గురించి చెబుతున్నప్పుడు తన మనసు కూడా కలత చెందిందని ఆయన అన్నారు.అందువల్ల నవరత్నాల గురించి ఇవ్వాళ చెప్పడం లేదని జగన్ చెప్పారు.

Share