మెల్‌బోర్న్‌లో `జై జ‌గ‌న్‌`

ఏపీ టాప్ న్యూస్‌: అది క్రికెట్ స్టేడియం.. ఆశామాషి క్రికెట్ స్టేడియం కాదు.. పేరు మోసిన మైదానం. అలాంటి స్టేడియంలో చ‌ప్ప‌ట్లో మోగ‌త‌లు మోగ‌లేదు. ఫోర్లు.. సిక్స్‌లు అని అర‌వ‌లేదు కానీ అక్క‌డ “జై జ‌గ‌న్‌.. జైజై జ‌గ‌న్‌. జ‌గ‌న్ వెంటే ఉంటాం..జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తాం“ అనే నినాదాల‌తో మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం మార్మోగింది. ఈ రోజు మెల్‌బోర్న్‌లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో ఎవరూ ఊహించని దృశ్యం ఒకటి కనిపించింది. మెల్‌బోర్న్‌లో ఉంటోన్న కొంతమంది జగన్ అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు పట్టుకుని గ్యాలరీలో సందడి చేశారు. మెల్‌బోర్న్‌లో ఉంటోన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు యార్లగడ్డ రమ్య, రాజేష్ శాకమూరి తదితరులు ఇలా పార్టీ బ్యానర్లు, జెండాలతో స్టేడియంలో సందడి చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటూ వారు జగన్ ఫ్లెక్సీలను స్టేడియంలో ప్రదర్శించారు. ఇదిలా ఉంటే.. భారత్, ఆసీస్ మధ్య జరిగిన ఈ రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించాడు. 19 ఓవర్ల వరకు ఆట బాగానే సాగింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది. ఇక వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. కాగా ఒక వ్యక్తిపై అభిమానం పెంచుకుంటే మనం దేశం దాటినా ఆ అభిమానం మాత్రం మన గుండెను దాటి వెళ్లదు. మనం ఎక్కడున్నా మనం అభిమానించే వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోంది.

Share