వైయ‌స్ఆర్‌సీపీలోకి మోదుగుల‌?

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయ‌నే చెప్పాలి. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. మొన్న‌టి మొన్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి రామ‌చంద్ర‌య్య వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌గా తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ఆయ‌న వైసీపీలోకి వ‌స్తున్నార‌న‌డానికి ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే మోదుగుల మొన్న‌ కార్తీక మాస వ‌న భోజ‌నాల్లో పాల్గొన్నారు. కాగా అక్క‌డికి వ‌చ్చిన వారంతా ముందుగా దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి నివాళులు అర్పించారు. విశేష‌మేమిటంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల కూడా వైయ‌స్ఆర్‌కు నివాళులు అర్పించారు. ఆయ‌న అంత‌టితో ఆగ‌లేదు తెలుగుదేశం పార్టీలో రెడ్ల‌కు అంత విలువ లేద‌ని కూడా చెప్పేశారు.
గురజాలలో కాసు మహేశ్ ను గెలిపించాలని కూడా మోదుగుల పిలుపునిచ్చార‌ట‌. అయితే మోదుగుల కుటుంబ సభ్యులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండ‌డం, తాజాగా జ‌రిగిన వ‌న‌భోనాల్లో వైయ‌స్ఆర్‌కు నివాళుల‌ర్పించ‌డాన్ని చూసిన స్థానికులంతా మోదుగులు త్వ‌ర‌లోనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ చ‌ర్చించుకోవ‌డం కనిపించింది. వివిధ పార్టీల నుంచి నాయ‌కుల చేరిక‌ల‌తో వైయ‌స్ఆర్‌సీపీ ఏపీలో బ‌ల‌ప‌డుతోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Share