నేనున్నానంటూ!

ఏపీ టాప్ న్యూస్‌: ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు ప్ర‌తిచోటా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మేళ తాళాలు.. డప్పుల మోతలు.. పెద్ద పులి నృత్యాలతో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. కిలోమీటర్ల మేర మహిళలు బారులు తీరి నీరాజనం ప‌లుకుతున్నారు. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూస్తుంటే నిజంగా వైయ‌స్ జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల‌కు ఇంత అభిమానం ఉందా అనిపిస్తోంది. అయితే 312 రోజులుగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఓపిగ్గా వింటున్నారు. ప్ర‌జ‌లు కూడా వైయ‌స్ జగ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నేతల తీరుతో తాము పడుతున్న ఇబ్బందులను జననేత దృష్టికి తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం నేతలు అవలంబిస్తున్న పక్షపాత వైఖరిని వివరిస్తూ కన్నీటిపర్యంతమవుతున్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో తాము అనుభవించిన కష్టాలను జననేత వద్ద బాధితులు ఏకరువు పెడుతున్నారు.
అయితే ప్ర‌జ‌లంద‌రికీ వైయ‌స్ జ‌గ‌న్ ఒక‌టే మాట చెబుతున్నారు. ఈ దుర్మార్గ పాల‌న మ‌రెంతో కాలం ఉండ‌ద‌ని, మీ అంద‌రి దీవెన‌లు,ఆశీస్సుల‌తో త్వ‌ర‌లోనే రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని, అప్పులు మీ అంద‌రి క‌ష్టాలు తీరి పోతాయ‌ని భ‌రోసా ఇస్తున్నారు. ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం వ‌చ్చే వ‌ర‌కు మీతోనే నేనుంటానంటూ హామీ ఇస్తున్నారు. దీంతో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌నాలు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.

Share