సోనియా వీడియో సందేశం

ఏపీ టాప్ న్యూస్‌: ప‌్ర‌త్యేక తెలంగాణ‌ను ప్ర‌క‌టించిన దాదాపు నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత యూపీఏ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ దాదాపు 10 రోజుల క్రితం తెలంగాణ‌కు వ‌చ్చి మేడ్చల్ బహిరంగ సభలో ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌ను ఇచ్చింద‌ని, ప్ర‌జా ఫ్రంట్ కూట‌మిని గెలిపించాల‌ని కోరారు. అయితే తాజాగా సోనియాగాంధీ తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించాల‌ని కోరుతూ ప్ర‌జ‌ల‌కు మ‌రో సందేశాన్ని కూడా పంపారు.ఒక వీడియో విడుదల చేశారు.ప్రజా ప్రంట్ తెలంగాణ ప్రజల గొంతుక అని , ప్రజల గొంతు వినిపిస్తుందని ఆమె అన్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి చేతిలో ప్రజలు మోసపోయారని ఆమె విమ‌ర్శించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకునే సమయం
వచ్చిందని ఆమె అన్నారు. ఇప్పుడు మీరు ఎన్నుకునేది మీ ఎమ్మెల్యేను మాత్రమే కాదని.. మీ భవిష్యత్తును కూడా అని పేర్కొన్నారు. అయితే సోనియాగాంధీ మరోసారి ప్రచారానికి వస్తారని భావించారు కానీ ఆమె రాలేదు.

Share