ఎన్ఐఏ ద‌ర్యాప్తు చేయించే విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాలి

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన హత్యాయత్నం కేసు విచారణకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు చేయించే విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విశాఖ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగినందున చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు చేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అలాగే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి దీనిపై ఒక పిల్ వేసి అస‌లు రాష్ట్రానికి దీనిపై విచార‌ణ చేసే అధికారం ఉండదని, కేంద్ర సంస్థలకే అధికారం ఉంటుందని పిల్ వేశారు. వీటిపై విచారణ చేసిన హైకోర్టు ఏపీ ప్రభుత్వ అభిప్రాయం కోరింది. అయితే ఈ కేసు కేంద్రం కిందకు రాదని ఏజీ వాదించారు. అయితే హైకోర్టు దానితో అంగీకరించలేదు. ఈ నెల పద్నాలుగులోపు కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కాగా ఎన్ఐఏ దర్యాప్తు విషయమై కేంద్ర నివేదికను సీల్డ్ కవర్ లో అంద చేయాలని కూడా హైకోర్టు కోరింది.

Share