మ‌ర‌ణ‌మే లేకుండా చేస్తా!

మ‌ర‌ణ‌మే లేకుండా చేస్తా!
వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు హామీ ఇదేన‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా!
ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నా గ‌త వారం ప‌ది రోజుల నుంచి విమ‌ర్శ‌ల్లో మ‌రింత తీవ్ర‌త‌ను పెంచారు. చంద్ర‌బాబు బ్లఫ్ మాస్టర్ అని, ఆయన మాటలు, హామీలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తే రాష్ట్ర ప్రజల ఆయుష్షును 10 ఏళ్లు పెంచుతానని, అస‌లు మ‌ర‌ణ‌మే లేకుండా చేస్తాన‌ని హామీ ఇచ్చినా ఇస్తార‌ని ఎద్దేవా చేశారు.
తన కుటుంబం తాగే హిమాలయా స్పెషల్ బ్రాండ్ వాటర్‌ను ప్రజలందరికీ అందిస్తానని చెబుతారంటూ విమర్శించారు. `2020 నాటికి ఏపీ జీడీపీని 7 రెట్లు పెంచుతానని చెప్పి చంద్రబాబు అడ్డంగా బుక్కయారు. ప్రజల ఆయుష్షు మరో పదేళ్లు పెంచుతాను లాంటి వ్యాఖ్యలు తమ దేశంలో చేస్తే పిచ్చాసుపత్రికి పంపిస్తారని స్విట్జర్లాండ్ అధికారులు అన్నారు. ఏపీకి వచ్చిన సింగపూర్ వాణిజ్య బందంతో మాట్లాడుతుండగా.. ఆర్థిక మంత్రి పాస్కల్ కల్పించుకుని చంద్రబాబు గాలి తీసేశారు. ఇలాంటి హామీలిస్తే తమ దేశంలో జైలుకు పంపిస్తారని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు తీరులో మార్పు రాలేదు. గతంలో కేవలం పాస్కల్ మాత్రమే చంద్రబాబు అబద్ధపు హామీలు, లెక్కలను ప్రశ్నించగా.. ప్రస్తుతం ఏపీ యువత మొత్తం చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధంగా ఉంది. ఆయన ఇప్పటికైనా మారితే మంచిదని` విజయసాయిరెడ్డి సూచించ‌డం గ‌మనార్హం.

Share