అక్క‌డో నీతి..ఇక్క‌డో నీతా బాబూ?

ఏపీ టాప్ న్యూస్‌: “త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం చంద్ర‌బాబు నాయుడు ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌డు. ఎవ‌రితో పొత్తు క‌ల‌వ‌డానికైనా..ఎవ‌రినైనా వెన్నుపోటు పొడ‌వ‌డానికైనా వెనుకాడ‌డు. తాను, త‌న కుటుంబం బాగుంటే చాలు ప్ర‌జ‌లు ఏమైపోతే నాకేంటి అనే వ్య‌క్తి ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చున్నాడు కాబ‌ట్టే రాష్ట్రం ఇలా త‌గ‌ల‌బ‌డి ఉంది. తెలంగాణ‌కు వెళ్లి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను ఓడించాల‌ని పిలుపునిస్తాడు.. ఏపీలో తాను వేరే పార్టీ ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి రూ.30 కోట్లు ఇచ్చి సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్లు కొంటాడు. వాళ్ల‌తో రాజీనామా కూడా చేయించ‌కుండా న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇస్తాడు. ఇంత‌టి దుర్మార్గ‌మైన ముఖ్య‌మంత్రి దేశంలో ఎక్క‌డా ఉండ‌డు“ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా 314 రోజులుగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ ఈ రోజు చిల‌క‌పాలెంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు అధికారంలోకి ఉంటే ప్ర‌జ‌ల‌కే క‌ష్టాలేకానీ సంతోషాలు ఉండ‌వ‌న్నారు. ఇంకా ఏమ‌న్నారో వైయ‌స్ జ‌గ‌న్ మాట‌ల్లోనే… శ్రీకాకుళం జిల్లాలో విద్యాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంబేద్కర్‌ యూనివర్సిటీ తీసుకొచ్చారనీ, కానీ చంద్రబాబు ఆ వర్సిటీని నాశనం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.
కనీస వసతుల కల్పించకుండా, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వకుండా దగా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 96 మంది అధ్యాపకులు ఉండాల్సిన వర్సిటీలో కేవలం 12 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు మాత్రమే ఉన్నారని తెలిపారు. పోస్టులు భర్తీ చేయక కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ప్రభుత్వమైనా మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తుందనీ, టీడీపీ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే 34 ప్రభుత్వ పాఠశాల్ని, 5 హాస్టళ్లు మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయనీ, మిగతా 10 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు.

Share