జ‌గ‌న్‌కు అనుభ‌వం లేదా?

ఏపీ టాప్ న్యూస్‌: “ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అదిస్తాం..ఇదిస్తాం అని హామీలు గుప్పిస్తున్నారు. ఆయ‌న‌కు ఏం అనుభ‌వం ఉంది? ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎన్నో మాట‌లు చెప్పి ఏమీ చేయ‌లేదు. ఆయ‌న‌కు అనుభ‌వ‌మైనా ఉంది. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌కు అదికూడా లేదు. అన్నీ చేస్తాన‌ని చెబుతున్నాడు. అన్నీ ఇస్తామ‌ని చెప్పిన త‌ర్వాత ఏదీ ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌స్తే ఏం చేస్తారు? స‌ంప‌ద సృష్టించ‌కుండా ఎలా చేస్తారు? “ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించారు. ఉండ‌వ‌ల్లిలోని గ్రీవెన్స్‌సెల్‌లో సంక్షేమ రంగం, సామాజిక సాధికారిత‌పై మూడో శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేసిన అనంత‌రం చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత విమ‌ర్శిలు చేశారు. అయితే బాబు విమ‌ర్శ‌లు అలా ఉంచితే రాజ‌కీయాల్లో 40 ఏళ్ల అనుభ‌వం ఉంద‌ని, దేశంతోనే త‌నంత‌టి సీనియ‌ర్ నాయ‌కుడు మ‌రొక‌రు లేర‌ని చెప్పుకుంటున్న బాబు రాష్ట్రానికి ఏం చేశారో స‌మాధానం చెప్పాలి.
అంతేకాదు వైయ‌స్ జ‌గ‌న్‌కు అనుభ‌వం లేద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌రు? కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీని స్థాపించి 67 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా స‌మ‌ర్థ‌వంతంగా రాణిస్తున్నారు. ఇంత‌టి చ‌రిత్ర ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌కు ఏమీ అనుభ‌వం లేద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించ‌డం ఆయ‌న స్థాయిని త‌గ్గించుకోవ‌డ‌మే. అయితే ఇదంతా ఒక ఎత్తైతే చంద్ర‌బాబుకు త‌న త‌ప్పులు క‌నిపించ‌వ‌న్న‌ట్లుగా జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూనే త‌న కొడుకు నారా లోకేష్‌ను మంత్రిని చేశారు. లోకేష్‌కు ఏం అనుభ‌వం ఉంద‌ని మంత్రిని చేశారు? క‌నీసం పంచాయ‌తీ ప్ర‌సిడెంట్‌గా కూడా ప‌నిచేయ‌లేదు.. ఎక్క‌డ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు క‌దా? మ‌రి ఇదంతా మీకు క‌నిపించ‌డం లేదా బాబూ? స‌రే పోనీ 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేయ‌లేదా? స‌మాధానం చెప్పండి బాబు?.

Share