నాడు..నేడు బాబు ఒకే మాట‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట‌పై నిల‌బ‌డ‌ర‌ని, ఆయ‌న చెప్పింది ఏదీ చేయ‌డ‌ని, ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్ప‌డం..మోసం చేయ‌డం ఆయ‌న నైజం అని ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌, ఆ పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే వారంతా విమ‌ర్శిస్తున్న‌ట్లు అవ‌న్నీ నిజ‌మో కాదో అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఒక్క విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు నాడు..నేడు ఒకే మాట‌పై ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారా? అయితే వివ‌రాల్లోకి వెళ్దాం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రికొన్ని రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్యాయం చేశార‌ని, రాష్ట్ర అభివృద్ధికి ఆయ‌న స‌హ‌క‌రించ‌లేద‌ని, పోల‌వ‌రం పూర్తికి అడ్డంప‌డ్డార‌ని అన్నారు. అంతేకాదు మోడీ స‌భ‌ల‌కు ఎవ‌రూ వెళ్ల‌వ‌ద్ద‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లు నిర‌స‌న తెల‌పాల‌ని పిలుపునిచ్చారు.
అయితే గ‌తంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ఏపీకి వ‌స్తున్న నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వ‌స్తున్నార‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రాన్ని విడ‌గొట్టి అన్యాయం చేసి, ఇప్పుడు పుండుపై కారం చ‌ల్లిపోవ‌డానికి వ‌స్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆ మాట‌లు అని కొన్ని నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేశారు. ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనికి కూడా రాష్ట్రానికి అన్యాయం చేసి ఏ మొహం పెట్టుకుని వ‌స్తున్నార‌ని నిల‌దీస్తున్నారు. రేపు మ‌ళ్లీ బీజేపీతో బాబు క‌లిసి పోటీ చేయ‌ర‌ని గ్యారెంటీ ఏమీ లేదు. కాబ‌ట్టి చంద్ర‌బాబు నాడు..నేడు ఒకేమాట‌పై ఉన్నార‌ని నెటిజ‌నులు సెటైర్లు వేస్తున్నారు.

Share