హైకోర్టూ తాత్కాలిక‌మేనా?

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగు రాష్ట్రాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టిగానే ఉన్న హైకోర్టు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి వేర్వేరుగా ప‌నిచేయ‌నున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీచేసిన‌ట్లు న్యాయ శాఖ చెబుతున్నా ఏపీ న్యాయ‌వాదులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. హైకోర్టు ఎదుట ధ‌ర్నాకు దిగారు. హైకోర్టు భ‌వ‌నం పూర్తి కాక ముందే హైకోర్టును ఎలా విభ‌జిస్తార‌ని వారు ప్ర‌శ్నించారు. భ‌వ‌నం పూర్తియింద‌ని ఏపీ ప్ర‌భుత్వం త‌ప్పుడు నివేది ఇచ్చింద‌ని వారంటున్నారు. పోనీ చెట్ల కింద ప‌నిచేద్దామ‌నుకున్నా అక్క‌డ చెట్లు కూడా లేవ‌ని న్యాయ‌వాదులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గెజిట్ నోటిఫికేష‌న్‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం పూర్తి కాకముందే హైకోర్టు విబజన జరగడంతో ఇప్పుడు మరో తాత్కాలిక భవనంలో హైకోర్టును ఏర్పాటు చేస్తున్నారు. దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జనవరి1 నుంచి విజయవాడ సీఎం క్యాంప్‌ ఆఫీసులో తాత్కాలికంగా హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని కూడా చెప్పారు. అమరావతిలో శాశ్వత భవనం నిర్మించిన తర్వాత.. ప్రస్తుత తాత్కాలిక హైకోర్టును జిల్లా కోర్టుగా మారుస్తామన్నారు. ఏదేమైనా జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ఏపీలో హైకోర్టు ప్రారంభం కాబోతోంద‌న్న‌మాట‌.

Share