బాబు కొత్త స్కీమ్ ఏంతో తెలుసా?

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు మ‌రొక‌సారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీ నుంచి చంద్ర‌బాబు బయ‌ట‌కు వ‌చ్చిన నాటి నుంచి ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చిన జీవీఎల్ తాజాగా మ‌రొక‌సారి ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌న్నీ, చేసేవ‌న్నీ మోసాల‌ని విమ‌ర్శించారు. తాజాగా బాబు మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టార‌ని, దాన్ని పేరు “చంద్ర‌న్న రాళ్లు“ అని న‌ర‌సింహారావు ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేయడాన్ని ఆయన త‌ప్పు బ‌ట్టారు. శంకుస్థాపన రాళ్లు పాతి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని,ప్రజలు ఇలాంటివాటిని నమ్మబోరని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేశారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ కు పెట్టుబడులు ఎలా సమీకరిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక ప్రకటన చేస్తూ ఎపి ప్రభుత్వం కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించింది.అయినా ఎపి ప్రజలకున్యాయం చేయడానికి కేంద్రం సిద్దంగా ఉందని తెలిపింది.మౌలిక సదుపాయాలు, ఇనుప ఖనిజ నిక్షేపాల గురించి నివేదిక ఇవ్వలేదని కేంద్రం పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Share