సీమ‌కు బాబు అన్యాయం చేస్తున్నారు

ఏపీ టాప్ న్యూస్‌: మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి చాలా రోజుల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌ని మైసూరా రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌లపై గ‌ళం వినిపించేందుకు ముందుకు వ‌చ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాయ‌ల‌సీమ‌కు అన్యాయం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. మైసూరారెడ్డి మ‌రో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు శివ‌రామ‌కృష్ణ‌, మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డిల‌తో క‌లిసి మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మైసూరా మాట్లాడుతూ రాయలసీమకు రాష్ట్ర ప్ర‌భుత్వం న్యాయం చేయడం లేదన్నారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి మైసూరా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు లేఖ రాశారు. రాయలసీమకు నీటి పంపకాలలో అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజనతో రాయలసీమకు ఎక్కువ నష్టం జరిగిందని ఆయన అన్నారు. విభజన తర్వాత కూడా రాజధాని, హైకోర్టు లను కూడా ఒకే చోట పెట్టి మళ్లీ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.రాయలసీమలో హైకోర్టు పెట్టాలని న్యాయవాదులు కోరుతున్నా పట్టించుకోవోడం లేదని వారు అన్నారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఇచ్చామని చెప్పడం అసత్యమని వారు స్పష్టం చేశారు. ఇప్పటికీ రాయలసీమ కరువుతో అల్లాడుతోందని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Share