ఎన్టీఆర్ టీంకు నాదెండ్ల వార్నింగ్‌

ఏపీ టాప్ న్యూస్‌: ప్రస్తుతం సినీ ఇండస్ట్రిలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వేర్వేరు కోణాల్లో సినిమాలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ వస్తుండగా..క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన రీతిలో వారు వేర్వేరు వర్షన్స్ లో తీస్తున్న ఈ చిత్రాలపై వివాదాలు చోటు చేసుకున్నాయి. వర్మ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఇటీవలె విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ లో చంద్రబాబును విలన్ చూపినట్లు ఉందని టీడీపీ నేతలు దీనిపై అభ్యంతరం తెలిపారు.
ఇదే సందర్భంలో క్రిష్ తీస్తున్న సినిమాలో తనను విలన్ చూపిస్తున్నారని ఆరోపిస్తూ ఈ మూవీపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు తాజా ఈ సినిమాలో తనను విలన్ గా తీస్తున్నారని ఎన్టీఆర్ కు తొలినాళ్లలో చేడోడువాడోదుగా నిలిచిన నాదెండ్ల భాస్కర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇప్పటికే ఈ అంశంపై హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, సెన్సార్ బోర్డులకు కోర్టుల నుంచి నోటీసులు పంపినట్లు కూడా స్వ‌యాన నాదెండ్ల భాస్క‌ర్ రావే అన్నారు. దీంతో ఈ బయోపిక్ వివాదం ఎంత వరకు దారితీస్తోందనేది చర్చనీయాంశంగా మారింది.

Share