మా నాయ‌కుడు జ‌గ‌నే

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌గ‌తే ల‌క్ష్యంగా, పేద సామాన్య వ‌ర్గాల సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా న‌వ‌ర‌త్నాలాంటి ప‌థ‌కాల‌ను వెంట‌బెట్టుకుని సాగుతున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైత్ర‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. 332 రోజులుగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ ఈ రోజు ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టారు. కాలిన‌డ‌క‌న వేలాది కిలోమీట‌ర్లు ప‌ర్య‌టించి కోట్లాది జ‌నుల గోడును ఆల‌కించి, వారి బంగారు భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కాకుళం జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 230 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర సాగించారు.
చంద్ర‌బాబు ప్ర‌భుత్వ దారుణాలు, అక్ర‌మాల‌తో న‌ర‌కం అనుభ‌విస్తున్న ప్ర‌జ‌ల‌ను క‌లిసి వైయ‌స్ జ‌గ‌న్ వారి బాధ‌ల‌తో పాటు విద్య‌, వైద్యం, సాగునీరు, తాగునీరు త‌దిత‌ర ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించేందుకు సాధ్య‌మైన హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. గ‌త నెల 25న పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గం వీర‌ఘ‌ట్టం మండ‌లం న‌డిమికెల్ల గ్రామం వ‌ద్ద ప్రారంభ‌మైన శ్రీ‌కాకుళం జిల్లా యాత్ర పాల‌కొండ‌, రాజాం, ఎచ్చెర్ల‌, శ్రీ‌కాకుళం, ఆమ‌దాల‌వ‌ల‌స‌, న‌ర‌స‌న్న‌పేట‌, టెక్క‌లి, పాత‌ప‌ట్నం త‌దిత‌ర ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో దిగ్విజ‌యంగా పూర్తికావ‌డం గ‌మ‌నార్హం.

Share