ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర @ 3600

ఏపీ టాప్ న్యూస్ : ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్రలో మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. ప్ర‌స్తుతం ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ బారువ జంక్ష‌న్ వ‌ద్ద 3600 కిలోమీట‌ర్ల మైలురాయిని దాటారు. ఈ మైలురాయికి గుర్తుగా వేప మొక్కను నాటి, పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కీలక ఘట్టంలో భాగమయ్యేందుకు ప్రజలు, కార్యకర్తలు, వైయ‌స్ఆర్ అభిమానులు జననేత అడుగులో అడుగేశారు.

Share