జ‌న‌హితం..జ‌న‌నేత ల‌క్ష్యం

ఏపీ టాప్ న్యూస్‌: ఒక్క అడుగు లక్షలాది అడుగులకు స్ఫూర్తినిచ్చింది.ఒక్కడిగా మొదలైన పయనం..జగమంత కుటుంబాన్ని ఒక్కటి చేసింది.అభిమానం గూడుకట్టుకుంటే..అచ్చం వైయ‌స్ జ‌గ‌న్‌లాగే ఉంటుందనే సత్యం అడుగడుగులో కనిపించింది.అక్కచెల్లెమ్మల ఆప్యాయత..అన్నదమ్ముల అనురాగం..అవ్వాతాతల మమతానురాగం..పల్లె ముంగిట్లో పండుగ వాతావరణం..పట్టణాల్లో కోలాహలం.. అన్న రాకఓ సంబరం.చీకట్లను చీల్చుకుంటూ.. కుట్రలకుఎదురొడ్డి నిలుస్తూ..నవోదయానికి నాంది పలుకుతూ..అదిగో జగనన్న..మొక్కవోని ఆశయం దిశగా ప‌డుతున్నాయి ఆ అడుగులు.
ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. భవిష్యత్‌పై నమ్మకాన్ని కల్పించే లక్ష్యంతో చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చివ‌రి అంకానికి చేరుకుంది. రేపు ఇచ్ఛాపురం బ‌హిరంగ స‌భ‌తో పాద‌యాత్ర ముగియ నుంది. కాగా పాద‌యాత్ర అడుగడుగునా జనహితంగా సాగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో అష్టకష్టాలు పడుతున్న వివిధ వర్గాల ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి వెంట అడుగులు వేస్తూ తమ సమస్యలను విన్నవించారు. మద్యంతో కుదేలవుతున్న కుటుంబాల్లోని మహిళలు, ఆక్వా, వరి, పాడి రైతులు, చేనేతలు, విద్యార్థులు, చేతి వృత్తిదారులు, కుల వృత్తిదారులు.. ఇలా అనేక వర్గాల ప్రజలు తమ కష్టాలు తీరుస్తాడనే నమ్మకంతో జగన్‌కు చెప్పుకునేందుకు తరలి వచ్చారు.

Share