విజ‌య‌స్థూపం ఆవిష్క‌ర‌ణ‌

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి “విజ‌య సంక‌ల్పం“ స్థూపాన్ని ఆవిష్క‌రించారు. బ‌హుదాన‌ది తీరంలో ఏర్పాటు చేసిన ఈ స్థూపాన‌ని ఆవిష్క‌రించిన అనంత‌రం బ‌హిరంగ స‌భా స్థ‌లికి బ‌య‌లుదేరి వెళ్లారు. . కాగా పైలాన్‌ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయ‌స్ జగన్‌ కాలినడకన పాత బస్టాండ్‌ వద్దకు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అంతకు ముందు వైయ‌స్ జగన్‌ పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైయ‌స్‌సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి.

Share