వైసీపీలో చేరిన భానుచంద‌ర్‌

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌లో ఊపందుకున్నాయి. రోజూ ఎవ‌రో ఒక‌రు ప్ర‌ముఖులు పార్టీలో చేరుతూనే ఉన్నారు. అయితే రాజ‌కీయ నాయ‌కులతో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా పార్టీలో చేరుతున్నాయి. ఇప్ప‌టికే పోసాని, కృష్ణుడు, పృద్వీరాజ్‌లు పార్టీలో చేరారు. తాజాగా సినీ హీరో భాను చంద‌ర్ కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్ర‌స్తుతం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇచ్చాపురంలో నేడు వైయ‌స్ జగన్ పాదయాత్ర నేటితో ముగియనుంది.

Share