గోళీలాట‌ ఆడ‌దామా బాబూ!

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లలతో సరదాగా గడిపారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చేసి, పైలాన్లను ఆవిష్కరించారు. కాగితపు పరిశ్రమకు సంబంధించి ఎంవోయూల మార్పిడి అనంతరం జన్మభూమి, మావూరు సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, పిల్లల ఆటల పోటీలను సందర్శించారు. అక్కడ గోలీలతో ఆడుతున్న పిల్లలను చూసిన ఆయన వాళ్లతో కాసేపు ఆడటం ఆశ్చర్యపరిచింది. గోళీలాటతోపాటు కర్రా బిల్లా (చిర్రాగోనె), వాలీబాల్ ఆటలు, కోలాటం ఆడుతూ సరదాగా గడిపారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.

Share