అది జ‌గ‌న్ ఎఫెక్టేనా?

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే ఇప్పుడిస్తున్న పింఛ‌న్‌ను రెట్టింపు చేస్తాన‌ని, రెండు వేలు పింఛ‌న్ ఇస్తాన‌ని, పాద‌యాత్ర‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌లుమార్లు చెప్పిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే పాద‌యాత్ర ద్వారా వైయ‌స్ జ‌గ‌న్‌కు రోజు రోజుకు ప్ర‌జ‌ల్లో అభిమానం పెరుగుతుండ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు చెబుతుండ‌డంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికిప్పుడు ఒక‌డుగు ముందుకేసీ తానే వ‌చ్చే నెల నుంచి పింఛ‌న్ రూ.2వేలు చేస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఎక్కడా జగన్ హామీని ప్రస్తావించకుండా, తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం ఈ విధంగా పెంచుతున్నట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వృద్దులకు, వితంతులకు ఫిబ్ర‌వ‌రి నుంచే ఈ మొత్తం పెంచి ఇవ్వాలని భావిస్తున్నారట.
అయితే చాలా మంది మేధావులు, రాజ‌కీయ నాయ‌కులు మాత్రం ఇది క‌చ్చితంగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్టేన‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ గాలి వీస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ముందుగానే ఇది ప్ర‌క‌టించి ఉంటార‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు ఇస్తున్న ఇలాంటి హామీల‌ను ప్ర‌జ‌లు ఎంత వ‌ర‌కు న‌మ్ముతారో చూడాలి.

Share