మొక్కులు చెల్లించిన జగన్

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాదాపు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో దాదాపు 14 నెల‌ల పాటు ఇడుపుల‌పాయ నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. అయితే సుధీర్ఘ పాద‌యాత్ర అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మొక్కులు చెల్లించుకునేందుకు సంక‌ల్పించారు. అందులో భాగంగానే గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైయ‌స్ జగన్‌.. సామాన్య భక్తునిలా క్యూ లైన్‌లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. నిన్న రాత్రి తిరుమలలోనే బస చేసిన జ‌గ‌న్ ఈ రోజు ఉదయం క‌డ‌ప జిల్లాకు చేరుకున్నారు. క‌డ‌ప జిల్లాకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్రజలు అడుగడుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దారి పొడుగున పూల వర్షం కురిపిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
కాగా క‌డ‌ప‌కు వ‌చ్చిన జ‌గ‌న్ అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్నారు. దర్గా వద్దకు చేరుకున్న జననేతకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. దర్గా పెద్దలు కూడా వైఎస్‌ జగన్‌కు ఎదురొచ్చి.. లోనికి ఆహ్వానించారు. దర్గాలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి ఆచారం ప్రకారం వైయ‌స్‌ జగన్‌ చాదర్‌ సమర్పించారు. ​

Share