ఎందుకు బాబు భ‌యం?

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం సరికాదనీ, ఎన్‌ఐఏ విచారణను రీకాల్‌ చెయ్యాలని మోదీని చంద్రబాబు కోరారు. చంద్రబాబు లేఖపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. దాడితో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోతే ఎన్‌ఐఏ విచారణకు ఎందుకు భయపడుతున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.
కాగా జగన్‌పై కత్తి దాడి కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు శ్రీనివాస్‌ను ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారం ఇవ్వాలని సెషన్స్ కోర్టులో నిందితుడి తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అతణ్ని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు ఆరోపించారు. పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు న్యాయవాది సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది.

జగన్‌పై దాడి కేసును ఇటీవలే ఎన్‌ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే. శనివారం (జనవరి 12) ఉదయం విజయవాడలోని జిల్లా కేంద్ర కారాగారం నుంచి నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని విశాఖ విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. అతణ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయంపై తమకేమీ సమాచారం ఇవ్వలేదని నిందితుడి తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. శ్రీనివాస్ తరఫున ముగ్గురు లాయర్లు వాదిస్తున్నారు.

Share