పులివెందుల‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు పూజ‌లు

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 14 నెల‌ల పాటు సాగిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర విజ‌య‌వంతం అయిన నేప‌థ్యంలో తిరుమ‌ల వెళ్లి శ్రీ‌వారికి మొక్కులు చెల్లించుకోవ‌డంతో పాటు పులివెందుల‌లో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు పూజ‌లు నిర్వ‌హించారు. ఈ రోజు ఉద‌యం పులివెందుల‌లోని స్థానిక సీఎస్ఐ చ‌ర్చిలో కుటుంబ స‌మేతంగా ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. అనంత‌రం గండి ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఇడుపుల‌పాయ వెళ్లి అక్క‌డ వైయ‌స్ఆర్ ఘాట్ వ‌ద్ద మ‌హానేత వైయ‌స్ఆర్‌కు ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ ప్ర‌జ‌ల ఆశీస్సులు.. నాన్న చ‌ల్ల‌టి దీవెన‌లు మెండుగా ఉండ‌డం వ‌ల్ల ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర విజ‌య‌వంతం అయింద‌ని అన్నారు. కడప జిల్లా నుంచే ఇతర కాకుండా జిల్లాల నుంచి కూడా అభిమానులు వైఎస్‌ జగన్‌తో పాటు ఆలయానికి తరలిరావడంతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Share