కాంగ్రెస్‌కు కూడా లోకువ‌య్యామా..!

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగు పార్టీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. రోజురోజుకు ఇంత దిగ‌జారిపోతున్నామా అంటూ బాధ‌ప‌డిపోతున్నారు. ఎందుకు అంత బాధ‌ప‌డిపోతున్నార‌నుకుంటున్నారా.. దానికో కార‌ణం ఉంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. కొన్ని నెల‌ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌లిసి పొత్తుతో పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే క‌లిసొస్తుంద‌ని అనుకున్న కాంగ్రెస్‌కు కూడా గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. అంతేకాదు ఎలాగైనా అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఊహించిని షాక్ ఇచ్చింది టీఆర్ఎస్‌. అయితే తెలంగాణ ఎన్నిక‌ల అనంత‌రం ప్ర‌జాభిప్రాయం తెలుసుకున్న కాంగ్రెస్ చంద్ర‌బాబుతో క‌లిసి పోటీ చేయ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని అర్థ‌మైంది.
ఈ నేప‌థ్యంలో ఇక టీడీపీతో కలిసి పోటీ వ‌ద్ద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు మ‌ళ్లీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రాహుల్ గాంధీతో క‌లిసి వ‌చ్చారు. మ‌ళ్లీ క‌ల‌వ‌డానికి కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఉన్న‌ట్లుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్‌చార్జి ఉమెన్ చాందీ మాట్లాడుతూ ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం లేద‌ని, ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని చెప్ప‌డంతో చంద్ర‌బాబు ఢీలా ప‌డిపోయారు. ఏపీలో ఒక్క సీటు కూడా గెల‌వ‌ని కాంగ్రెస్ పార్టీకి కూడా మ‌నం లోకువ‌య్యామా అంటూ బాధ‌ప‌డిపోతుండ‌డం గ‌మ‌నార్హం.

Share