బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న జ‌గ‌న్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు 40ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం ఉంది. రాష్ట్ర రాజ‌కీయాలు, రాష్ట్ర స్థితిగ‌తుల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉంది. అంతేకాదు ఎక్కువ కాలం ముఖ్య‌మంత్రిగా చేసిన అనుభ‌వం కూడా ఉంది. అలాంటి నాయ‌కుడు 40 ఏళ్ల వ‌య‌సున్న ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌ను కాపీ కొట్ట‌డం ఏంటి? ప‌్ర‌తిదీ ఆయ‌న బాట‌లో న‌డ‌వడ‌మేంటి? అని తెలుగుదేశం పార్టీ కార్యక‌ర్త‌లే చ‌ర్చించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ విశ్లేషులు స్పందిస్తూ చంద్ర‌బాబు నాయుడు చాలా తెలివైన వాడ‌ని, ఆయ‌న‌కంటే మంచిగా ముందు చూపుతో వైయ‌స్ జ‌గ‌న్ ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డం..ఆ ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుండ‌డం వ‌ల్లే బాబు ఆ ప‌థ‌కాల‌ను కాపీ కొడుతున్నార‌ని అంటున్నారు.
ఎవ‌రు ఏమి చేసినా, ఎవ‌రు ఏమి అనుకున్నా ఆయ‌న మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నే ఉద్దేశ్యంతోనే చంద్ర‌బాబు నాయుడు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌ను కాపీ కొడుతున్నార‌ని కూడా వారంటున్నారు. అయితే వైయ‌స్ జ‌గ‌న్‌ను కూడా ముందుగానే తాను ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌ను బాబు కాపీ కొడ‌తాడ‌ని చెప్ప‌డం.. ఒక‌వేళ కాపీ కొట్టినా అది ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రిగితే చాలు అన్న‌ట్లుగా మాట్లాడ‌డం కార‌ణంగా చంద్ర‌బాబు బాగా దొరికిపోతున్నార‌ని అంటున్నారు. కాగా ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ చంద్ర‌బాబు వంటి వాళ్ల‌కే చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారంటే భ‌విష్య‌త్‌లో మంచి లీడ‌ర్‌గా ఎదిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share