పాజిటివ్ టాక్ తెచ్చుకున్న యాత్ర‌

ఏపీ టాప్ న్యూస్‌: దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 970 థియేటర్లలో విడుదల చేశారు. వైయ‌స్ అభిమానులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. మమ్ముట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారని, దర్శకుడు చెప్పాలనుకున్న విషయాలను నేరుగా చెప్పాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు.
పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటిరోజు మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యూఎస్ ప్రీమియర్ షోలతో ఈ సినిమా 71,289 డాలర్లను వసూలు చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Share