బాబు దుబారాపై జ‌నం ఫైర్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌ను పెంచుకోవ‌డానికి ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని, త‌న ప్ర‌చారం కోసం ఇప్ప‌టికే రూ.13.77 కోట్లు ఖ‌ర్చుచేశార‌ని కాగ్ త‌ప్ప‌బ‌ట్టిన విష‌యం తెల‌సిందే. అయితే దాన్ని పెడ‌చెవిన పెడుతున్న చంద్ర‌బాబు తాజాగా మ‌రో సారి ఈనెల 11న ఢిల్లీలో చేప‌ట్ట‌బోయే ఒక్క రోజు దీక్ష కోసం రూ.10 కోట్లు ఖ‌ర్చు పెట్టేందుకు సిద్ధమ‌య్యారు. జీవోలు కూడా విడుద‌ల చేశారు. దీనిపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల సొమ్మును ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చుచేయ‌కుండా, త‌న సొంత ఖ‌ర్చుల‌కు ఉప‌యోగించుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టు అని ప్ర‌శ్నిస్తున్నారు.
గ‌త ఏడాది నుంచి ఈ ఏడాది వ‌ర‌కు చంద్ర‌బాబు ఖ‌ర్చు చేసిన వివ‌రాలు
* గత ఏడాది నుంచి ఇప్పటివరకు రంజాన్, ఏరువాక, జలహారతి, యువనేస్తం, పోలవరం తదితర ఈవెంట్ల ప్రచార ప్రకటనల వ్యయం : రూ.60.18 కోట్లు
* బాబుగారి ఒక రోజు నవనిర్మాణ దీక్ష హోర్డింగ్స్‌కు : రూ.13.76 కోట్లు ఖర్చు
* సీఎం నిర్వహించిన ఒక్కరోజు నవ నిర్మాణ దీక్ష ప్రచార ఖర్చు : రూ.8.67 కోట్లు
* బాబు ధర్మపోరాట దీక్ష హోర్డింగ్స్‌కు : రూ.3.99 కోట్లు
* ఇప్పటికే గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఔట్‌డోర్‌ ప్రచారం పేరుతో చేసిన ఖర్చు : రూ.30.26 కోట్లు
* అంబేద్కర్‌ ఆశయం–చంద్రన్న ఆచరణ ఈవెంట్‌ ప్రచార ఖర్చు : రూ.3 కోట్లు
* 1500 రోజుల పాలన పూర్తి పేరుతో ప్రచార ఖర్చు : రూ.17.79 కోట్లు
* 1500 రోజుల పాలన పూర్తి నేపథ్యంలో హోర్డింగ్స్‌ ఖర్చు : రూ.12 కోట్లు
* ఇందులో స్వచ్ఛ భారత్, సంక్రాంతి సంబరాలు హోర్డింగ్స్‌కు : రూ.7.67 కోట్లు
* సామూహిక గృహ సముదాయాల ఈవెంట్ల ప్రచారానికి హోర్డింగ్స్‌ ఖర్చు : రూ.4.59 కోట్లు
* ఇక యువనేస్తం హోర్డింగ్స్‌ ద్వారా ప్రచారానికి : రూ.6 కోట్లు

Share