గ‌వ‌ర్న‌ర్‌తో జ‌గ‌న్ ఏం మాట్లాడారు?

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీలో దొంగ ఓట్ల న‌మోదు, ఓట్ల తొల‌గింపు వ్య‌వ‌హారంపై ఈ రోజు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిశారు. అయితే అలా వెళ్లి ఇలా వ‌స్తార‌నుకున్న ప్ర‌జ‌ల‌కు, అధికార పార్టీ నాయ‌కుల‌కు పెద్ద షాక్ ఇచ్చారు వైయ‌స్ జ‌గ‌న్‌. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో గంట‌కు పైగా బేటీ అయ్యారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో జ‌గ‌న్ ఏం మాట్లాడి ఉంటారంటూ చ‌ర్చించుకోవ‌డం మొద‌లైంది. అయితే టీడీపీ నాయ‌కులు మాత్రం భ‌య‌ప‌డుతున్నార‌ట‌. అస‌లే చంద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు ప‌డ‌డం లేద‌ని, మొన్న చుక్క‌ల భూముల విష‌యంలో చంద్ర‌బాబు ఫైల్ పంపిస్తే గ‌వ‌ర్న‌ర్ సంత‌కం పెట్ట‌కుండా రిజ‌క్ట్ చేసి పంపించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడేమో జ‌గ‌న్ గంట‌కు పైగా భేటీ కావ‌డంతో బాబు గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయ‌ట‌.
ఈ ఇద్ద‌రి భేటీ వివ‌రాలు బ‌య‌ట‌కు తెలియ‌రాలేదు కానీ.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడింది మాత్రం రాష్ట్రంలో దొంగ ఓట్ల‌ను న‌మోదు చేస్తున్నార‌ని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని అన్నారు. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలనే గవర్నర్ కు వివరించినట్లు జగన్ తెలిపారు. పోలీసు వ్యవస్థను చంద్ర‌బాబు భ్రష్టు పట్టించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

Share