మీరు నాయ‌కులా? గూండాలా?

ఏపీ టాప్ న్యూస్‌:“ మీరు ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్నారు. ప్ర‌జా స్వామ్యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలియ‌దా? ప్ర‌జా స్వామ్యం అంటే గౌర‌వం లేదా? గూండాల్లా వ్య‌వ‌హ‌రించ‌డానికి సిగ్గులేదా? అంటూ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో విరుచుప‌డ్డారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మినారాయ‌ణ‌. రేపు ఆంధ్రప్ర‌దేశ్‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న న‌డుస్తోంద‌న్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారని, ఆర్టీవో అధికారులతో కలిసి సభకు వచ్చే బస్సు యజమానులను బెదిరిస్తున్నారని కన్నా ఆరోపించారు. ఈ విషయంలో పోలీస్‌ కమిషనర్‌కు కూడా కలిశామని చెప్పారు.
‘మోదీ సభను అడ్డుకోండి, నరకండి, చంపండి అని చంద్రబాబు తన గూండాలకు చెప్తున్నారు. ఇంతలా దిగజారిన సీఎంను ఇక్కడే చూస్తున్నాం’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మోదీకి ఎంట్రీ లేదంటూ టీడీపీ నేతలు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వచ్చే మార్గంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో మోడీ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని భారతీయ జ‌న‌తా పార్టీ నేత‌లు .. ఆ స‌భ‌ల‌ను అడ్డుకోవాల‌ని టీడీపీ నేత‌లు ఊగిపోతున్నారు. ఈ త‌రుణంలో మోడీ ప‌ర్య‌ట‌న ఏ స్థాయిలో జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి మ‌రి.

Share