యూట‌ర్న్ బాబు నిన్ను ఎలా న‌మ్మాలి?

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ ఈ రోజు ఢిల్లీలో దీక్ష చేస్తున్న విష‌యం తెలిసిందే. న‌ల్ల చొక్క వేసుకుని నిర‌స‌న తెలియ‌జేస్తున్న చంద్ర‌బాబుకు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు గుర్తు లేక‌పోవ‌డం నిజంగా బాధాక‌రం. ఎన్నిక‌ల ముందు ఏపీకి 15 ఏళ్లు ప్ర‌త్యేక హోదా కావాల‌న్న చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక హోదాతో ఏం వ‌స్తుంది అన‌డ‌మే కాదు.. హోదా అంటే జైలులో పెడ‌తాన‌న్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి కాబ‌ట్టి మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా నినాదం అందుకున్నారు. చంద్ర‌బాబు గ‌తంలో ఏమ‌న్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు.. ఎలా యూట‌ర్న్ తీసుకున్నారో తేదీల‌తో స‌హా ఆధారాలు ఇవిగో..

ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు
ఏప్రిల్‌ 29, 2014 : (తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా జరిగిన ఎన్నికల సభలో…) మనకు ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామంటున్నారు. ఐదేళ్లు, పదేళ్లు కాదు, 15 ఏళ్లు ఇవ్వండి అని మోదీగారిని కోరుతున్నా.
02.06.2015 : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు (ఎన్నికలు ముగిశాక విజయవాడ నవనిర్మాణ దీక్షలో)
ఆగస్టు 25, 2015 : ప్రత్యేక హోదా ఏమీ సంజీవిని కాదు, న్యూఢిల్లీలో ప్రధానితో భేటీ తర్వాత చంద్రబాబు వ్యాఖ్య.
12.08.2015 : హోదాతోనే అన్నీ రావు. కోడలు మగ పిల్లాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా?(విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో…)
18.05.2016: హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వక పోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?
19.05.2016: హోదాతోనే అంతా కాదు. అదేమీ సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధానికి విన్నవించా…
08.09.2016: మనకు ప్రత్యేక హోదా వీలు కాదన్నారు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం?
09.09.2016: ప్రత్యేక హోదా ఇవ్వలేం. కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలను లెక్కించి ఆ మేరకు నిధులిస్తామని అరుణ్‌జైట్లీ చెప్పారు. వారు ఇచ్చింది తీసుకుంటాం. అదే సమయంలో మనకు రావాల్సింది అడుగుతాం.
10.09.2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించొద్దని కోరుతున్నా.
11.09.2016: హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం. కేంద్రం చెప్పిన దాని కన్నా అదనంగా ఏం వస్తాయో చెప్పమనండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్రాలు అభివృద్ధి చెందలేదు.
18.09.2016: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా…
దాని వల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం.
23.09.2016: హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం.
26.09.2016: హోదా అంటే జైలుకే…! బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విద్యార్థుల తల్లి దండ్రులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక.
05.10.2016: కేంద్రం నుంచి పది రూపాయలు ఎక్కువే రాబట్టాలని చూస్తా.
ప్రత్యేక హోదాలో వస్తున్నవన్నీ ఇస్తున్నందుకే ప్యాకేజీని ఒప్పుకున్నాం.
29.10.2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు.
04.02.2017: హోదా వేస్ట్‌. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు.
17.03.2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు, ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తున్నాం.
06.06.2017: ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలు ఏమిటి? అదనంగా వచ్చేదేమిటి? ప్యాకేజీకి, ప్రత్యేక హోదాకు వ్యత్యాసం ఏమిటి? ప్యాకేజీలో లేనిదేంటి?
నేను దేశంలో సీనియర్‌ నేతను. నేను ఎవరికీ భయపడాల్సిన పని లేదు.
27.02.2017: ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని
కొందరు మభ్య పెడుతున్నారు.
02.03.2018: పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం
ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డంకులున్నాయి.

బాబు యూట‌ర్న్ తీసుకోవ‌డం…
06.03.2018 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నదే మన డిమాండ్, ఎవరూ ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రస్తావన కూడా తేవద్దు. ప్రత్యేక హోదా గురించే అందరూ మాట్లాడాలి.
08.03.2018 : కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నాం. మా మంత్రులు రాజీనామా చేస్తారు.
10.03.2018 : వైఎస్సార్‌ సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వం.
15.03.2018 : వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం. కొందరు కావాలనే కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్నారు.
16.03.2018 : మేమే కేంద్రంపై అవిశ్వాసం పెడతాం. వైఎస్సార్‌ సీపీ తీర్మానానికి మద్దతు ఇవ్వం.
24.03.2018 : హోదా కాకపోయినా ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు ఇచ్చినా మాకు ఓకే.
2018 మే : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
21.07.2018 : ప్రత్యేక హోదాకు బదులుగా నేను ఎప్పుడూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించలేదు.
25.07.2018 : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి.
18.09.2018 : ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తాం.
20.09.2018: ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం.
11.10.2018 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయాలని 15వ ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.

నాడు భ‌జ‌న‌లు.. నేడు నింద‌లు
మార్చి 16, 2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు అసెంబ్లీలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన చంద్రబాబు
మార్చి 16, 2017: ప్రపంచంలో అత్యుత్తమ ప్రధాని మోదీ. ఆయన్ను మించిన వారు లేరు. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు.
జులై, 2017: మళ్లీ మోదీయే ప్రధానిగా రావాలి. మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీలో తీర్మానం ప్రవేశపెట్టిన చంద్రబాబు.
డిసెంబర్‌ 12, 2018: మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మోదీ గద్దె దిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నా. టీడీపీ నాయకులతో చంద్రబాబు వ్యాఖ్య.
డిసెంబర్‌ 16, 2018: దేశంలోని అన్ని వ్యవస్థలను మోదీ నాశనం చేశారు. నా జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు.
జనవరి 20, 2019 : మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారు. మోదీని సాగనంపేంతవరకూ నిద్రపోకూడదు. (కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు వ్యాఖ్య)
ఫిబ్రవరి 9, 2019: మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారు? మోదీ పర్యటన ఏపీకి చీకటి రోజు, దుర్దినం. ఆయన పర్యటించే రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు.

Share