మీరు న‌న్ను చూపించ‌క‌పోతే నేను బాధ‌ప‌డ‌తా!

ఏపీ టాప్ న్యూస్‌: చంద్ర‌బాబుకు ప్ర‌చార ఆర్భాటాలు ఎక్కువ అన్న సంగ‌తి ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. అదే విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌రోసారి రుజువు చేసుకున్నారు. ధ‌ర్మపోరాట దీక్ష పేరుతో ఢిల్లీలో రూ. 12 కోట్లతో ప్ర‌జా ధ‌నాన్ని ఖ‌ర్చు చేస్తున్న‌ది పబ్లిసిటీ కోస‌మే అన్న విష‌యం బాబు స్వ‌యంగా ఒప్పుకున్నారు. ధ‌ర్మ‌పోరాట దీక్ష ప్రారంభోప‌న్యాసం చేసిన చంద్ర‌బాబు… జాతీయ మీడియాకు ప్ర‌త్యేకంగా విజ్ఞ‌ప్తి చేశారు. త‌న దీక్ష‌కు ప్ర‌చారం క‌ల్పించాల్సిందిగా కోరారు. త‌న దీక్ష‌ను చూపించ‌వ‌ద్ద‌ని మీడియా సంస్థ‌ల‌పై మోడీ ప్ర‌భుత్వం ఒత్తిడి తెస్తోంద‌ని ఆరోపించారు. ఆ విష‌యం త‌న‌కు తెలుస‌న్నారు. కానీ తాము కూడా ఈ దేశంలో భాగ‌మేన‌ని…. ఆ విష‌యాన్ని జాతీయ మీడియా కూడా గుర్తుంచుకోవాల‌న్నారు. ఆ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని త‌న దీక్ష‌కు స‌రైన ప్ర‌చారం క‌ల్పించాల‌ని కోరారు. మోడీ బాధ్య‌త‌ను గుర్తు చేసేందుకు తాను
వ‌చ్చాన‌ని… ఆ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన బాధ్య‌త జాతీయ మీడియాపై ఉంద‌న్నారు.
ఒక‌వేళ మీడియా త‌న దీక్ష‌ను చూపించ‌క‌పోతే తాను చాలా బాధ‌ప‌డుతాన‌ని… చంద్ర‌బాబు దీక్ష వేదిక మీద నుంచి జాతీయ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే మీడియా ప్ర‌తినిధులంతా చంద్ర‌బాబుకు ఎంత ప్ర‌చార పిచ్చి అని మాట్లాడుకోవ‌డం క‌నిపించింది. ఏదేమైనా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న ప్ర‌చార ఆర్భాటాల కోసం వంద‌ల కోట్లు ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని స్ప‌ష్టంగా అర్థమైంది.

Share