చంద్ర‌బాబుకు కోట్ల ఝ‌ల‌క్‌?

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగు దేశం పార్టీలో స‌ర్వేలు గుబులు రేపుతున్నాయి. ఆ పార్టీలో చేరుతామ‌ని వ‌చ్చిన వారంతా మ‌ళ్లీ వెన‌క‌డుగు వేస్తున్నారు. ఓడిపోయే పార్టీలో చేరి న‌ష్ట‌పోవ‌డం ఎందుకని వారు అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన పెద్ద త‌ల‌కాల‌తో ఇప్ప‌టికే చంద్ర‌బాబు సంప్ర‌దింపులు జ‌రిపారు. కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి వంటి వారు చంద్ర‌బాబును క‌లిసినా ఇంత వ‌ర‌కు టీడీపీ ఎప్పుడు చేర‌బోయేది ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం చూసి ఆయ‌న వెన‌క్కి త‌గ్గిన‌ట్టుగా తెలుస్తోంది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం పార్టీ మారితే చుల‌క‌న అయిపోతామ‌నే భావ‌న కేడ‌ర్ నుంచి వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో కోట్లను వెన‌క‌డుగు వేయించింది. అది కూడా డోన్ సీటు కాకుండా క‌ర్నూలు ఎమ్మెల్యే సీటు ఆఫ‌ర్ చేయ‌డంతో నిరాశ చెందిన‌ట్లు స‌మాచారం. అదే వైఎస్సార్ పార్టీలో చేరుంటే అదే క‌ర్నూలు ఎమ్మెల్యే, ఎంపీలు సీట్లు ద‌క్కేవేన‌ని ఆలోచిస్తున్నార‌ని అనుచ‌రులు అంటున్నారు. ఇటీవ‌ల నేష‌న‌ల్ మీడియా నుంచి వెలువ‌డుతున్నస‌ర్వేల‌న్నీ చంద్ర‌బాబును ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం చేయ‌డం చూసి ఆ పార్టీలో చేర‌డంపై మ‌రోసారి ఆలోచించాల‌ని ఆయ‌న అనుచ‌రులు కోట్ల‌ను నిల‌దీసిన‌ట్లు స‌మాచారం. ఇన్నాళ్లు ఎటూ కాకుండా ఉన్నాం… కాంగ్రెస్ పుంజుకుంటుంద‌న్న ఆశ‌లు కూడా లేవు. కేంద్రంలో కూడా అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేని ప‌రిస్థితుల్లె ప్ర‌త్యామ్నాయంగా ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అయితే బెట‌ర‌న్న అభిప్రాయాలు కేడ‌ర్ నుంచి వినిపిస్తున్నాయి. పైగా చంద్ర‌బాబును న‌మ్ముకుని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప‌రిస్థితి కూడా ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. క‌నీసం ఐదుగురికి కూడా చంద్ర‌బాబు టికెట్ ఇచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. అన్నింటికీ మించి త‌న తండ్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి గ‌తంలో చంద్ర‌బాబును తీవ్రంగా వ్య‌తిరేకించిన విష‌యం స్థానికంగా అంద‌రికీ తెలుసు. అలాంటి పార్టీలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తే చుల‌క‌న అవుతామ‌నే భావ‌న వ్యక్త‌మ‌వుతోంది. దాదాపుగా చంద్ర‌బాబుకు కోట్ల ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్లే..

Share