`చంద్ర‌బాబు అవ‌కాశ వాది`

ఏపీ టాప్ న్యూస్‌: ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌డంలో చంద్ర‌బాబును మించిన‌వారు లేర‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు అంటున్నారు. ఆయ‌న‌ది రెండు నాల్క‌ల ధోర‌ణి అని ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యులు అంటుంటారు కానీ.. అంత‌కంటే ఎక్కువే అని చెప్పినా త‌ప్పు లేద‌ని వారంటున్నారు. ప‌చ్చి అవ‌కాశ వాద రాజ‌కీయాల‌కు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్ప‌వ‌చ్చ‌ని అంటున్నారు. అందుకు కొన్ని ఉదార‌ణ‌లు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నాలుగేళ్ల వ‌ర‌కు బీజేపీ క‌లిసి ఉన్న‌ప్పుడు బీజేపీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనికి విప‌రీతంగా పొగిడారు. ప్ర‌ధాని ఏ నిర్ణ‌యం తీసుకున్నా అది గొప్ప నిర్ణ‌యం అంటూ భ‌జ‌న చేశారు. మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాలు అయితే అది తాను చెబితేనే చేశాన‌ని కూడా చెప్పారు. అలాంటి నిర్ణ‌యాల్లో పెద్ద‌నోట్ల ర‌ద్దు ఒక‌టి. ఇది తాను చెబితేనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేశార‌ని ప‌లు సంద‌ర్భంగా చెప్పారు. ప్ర‌తిక‌ల్లో భారీగా ప్ర‌చారాలు కూడా చేయించుకున్నారు. తీరా బీజేపీకి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మోడీని, ఆ పార్టీని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
తాజాగా చంద్ర‌బాబు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం నాశనం అయిందని, ఆర్థిక రంగం కుదేలైందని అన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ఆధ్వ‌ర్యంలో జరిగిన ధ‌ర్నాలో చంద్ర‌బాబు మాట్లాడుతూ నోట్ల రద్దుతో ప్రజలంతా నష్టపోయారని, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. ప్రధానికి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవ‌ని, ప్రధాని మోదీ ఎక్కడ డిగ్రీ చదివారో చెప్పగలరా? అని ప్ర‌శ్నించారు. రఫేల్‌‌ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయ‌ని, ప్రధాని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేన‌ని హెచ్చ‌రించారు కూడా. త్వరలోనే కుర్చీ దిగుతార‌ని, మోడీ అప్రజాస్వామ్య పాలన నుంచి విముక్తి కలిగించేందుకే తామంతా ఏక‌మ‌య్యామ‌ని చెప్పారు. ఏదేమైనా బాబు స్వార్థ రాజ‌కీయాల‌ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Share