చేరిక‌ల‌తో వైసీపీలో జోష్‌

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవ‌ల భారీగా చేరిక‌లు జ‌రుగుతున్నాయి. జిల్లాల్లో, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రోజూ వంద‌ల మంది పార్టీలో చేరుతుంటే పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటివారు చేరుతున్నారు. గ‌త కొద్ది రోజులుగా చూసుకుంటే అధికార పార్టీ నుంచి వ‌చ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేర‌డం ఎక్కువైంది. క‌డ‌ప జిల్లా రాజంపేట‌కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న చేరిక కొద్ది రోజుల‌కే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కూడా వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఎప్పుడు పార్టీలో చేరుతామ‌న్న‌ది త్వ‌ర‌లోనే చెబుతామ‌న్నారు. ఇదిలా ఉంటే సినీ ప్ర‌ముఖులు కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండ‌డం విశేషం.
అయితే అధికార పార్టీ నుంచి వ‌ల‌స‌లు ఊపందుకోవ‌డంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ క‌నిపిస్తోంది. అంతేకాదు ఇటీవ‌ల వ‌స్తున్న స‌ర్వేలు కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప‌ట్టం క‌ట్ట‌డం పార్టీ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ కూడా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటుండ‌డం, ఆ పార్టీకి రాష్ట్రంలో రోజు రోజుకు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డంతో ఈసారి ఫ్యాన్ గాలి వీస్తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Share