షాక్‌లో చంద్ర‌బాబు!

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు షాక్‌లో ఉన్నార‌ట‌. ఏంటి ఇలా జ‌రుగుతోంద‌ని త‌ల‌ప‌ట్టుకు కూర్చున్నార‌ట‌. ఈ ప‌రిష్కారం చూపండి అంటూ పార్టీ సీనియ‌ర్ల‌ను అడుగుతున్నారట‌. బాబు ఎందుకు అంత షాక్ గుర‌య్యారో తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. “మేము బ‌లంగా ఉన్నాం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాం. ప్ర‌తిప‌క్ష పార్టీకి ఈసారి వ‌చ్చిన‌న్ని సీట్లు కూడా రావు. ఆ పార్టీ క‌నుమ‌రుగు కావ‌డం ఖాయం“ అని చెబుతున్న చంద్ర‌బాబు నాయుడుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్‌లు ఇస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేప‌థ్యంలో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ మీరు గ‌ట్టిగా దెబ్బ‌కొట్టారు. భ‌రిస్తాం.. ఈ సారి మేము ఇంకా గ‌ట్టిగా దెబ్బ‌కొడ‌తామ‌ని చెప్పిన విష‌యాన్నిఅధికార పార్టీ నేత‌లు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు జారిపోతారేమో నని బాబు ఆందోళన చెందుతున్నాడు.
ఇప్పటికే కడపలో ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పోయిన విష‌యం తెలిసిందే. అయితే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా టీడీపీ కి రాజీనామా చేసి వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌బోతున్నాడు. ఇంత‌వ‌ర‌కు ఒక ఎత్తైతే తాజాగా విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) టీడీపీకి రాజీనామా చేశారు. ఆయ‌న కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌ని స‌మాచారం వ‌స్తోంది. ఆయ‌న కూడా వైసీపీలో చేరితే మాత్రం చంద్ర‌బాబుకు వ‌చ్చేది గ‌డ్డుకాల‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Share