లోటు బ‌డ్జెట్ అంటా.. వృథా ఖ‌ర్చులు చేస్తారు బాబూ..నిన్ను న‌మ్మ‌రు

ఏపీ టాప్ న్యూస్‌: తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. గ‌త కొన్ని రోజులుగా బాబుపై ఆరోప‌ణ‌లు చేస్తున్న త‌ల‌సాని ఇప్పుడు మ‌రొక్క‌సారి చంద్ర‌బాబు దుబారాపై ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌ల సొమ్మును త‌న సొంత ప్ర‌చారాల‌కు ఉప‌యోగించుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా కావాలంటూ ఢిల్లీలో చంద్ర‌బాబు చేసిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌పై త‌ల‌సాని పైవిధంగా స్పందించారు. త‌ల‌సాని ఇంకా ఏమ‌న్నారంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.16000వేల కోట్ల లోటు బ‌డ్జెట్ పెట్టుకుని ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు. రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉంటే డ‌బ్బులు ఎలా ఖ‌ర్చు చేస్తార‌ని త‌ల‌సాని ప్ర‌శ్నించారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిత్యం అసత్యాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము ఏపీలో పర్యటించి బలహీనవర్గాలను చైతన్యపరుస్తామని ఆయన చెప్పారు. ఐదేళ్లు అయినా విజయవాడ కనకదుర్గ ప్లైఓవర్ పూర్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని స్కీములు ఇప్పుడు పెట్టినా ప్రయోజనం లేదని తలసాని అన్నారు. గతసారి తనను కలిసిన బందువులు,ఇతరులను ప్రభుత్వం వేదించిందని ఆయన చెప్పారు.

Share