ఇది ప్ర‌జాస్వామ్య‌మా? రౌడీ రాజ్య‌మా?

ఏపీ టాప్ న్యూస్‌: “అధికార పార్టీ నేత‌లు ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. అధికారాన్ని అండ‌గా చూసుకుని రెచ్చిపోతున్నారు. పోలీసులు సైతం చోద్యం చూస్తుండ‌డంతో ప‌చ్చ‌పార్టీ నేత‌ల ఆగ‌డాల‌కు హ‌ద్దే లేకుండా పోతోంది. ఈ రోజు శ్రీ‌కాకుళం జిల్లా, కోట‌బొమ్మళిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను చూస్తే ఇది ప్ర‌జా స్వామ్య‌మా? రౌడీ రాజ్య‌మా? అనే అనుమానం క‌లుగుతోంది. వివ‌రాల్లోకి వెళ్లితే..
కోటబొమ్మాళి మండల వైయ‌స్ఆర్ సీపీ కార్యాలయంపై ఆ రోజు ఉదయం టీడీపీ నేత బోయిన రమేష్‌ ఆధ్వర్యంలో దాడి చేశారు. ముందుగా పార్టీ కార్యాలయంలోకి దూసుకు వెళ్లి… ఫర్నిచర్‌తో పాటు కొన్ని ఫైల్స్ ధ్వంసం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు వైయ‌స్ఆర్‌ కార్యకర్తలపై కర్రలు, ఐరన్‌ రాడ్లుతో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా రక్తం వచ్చేలా కొట‍్టారు. ఈ దాడిలో సుమారు 120మంది పాల్గొన్నట్లు అక‍్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కాగా దాడి జరిగిన ప్రాంతానికి …కేవలం అయిదు వందల మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్‌ ఉంది. అయితే ఇప్పటివరకూ ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అంతేకాకుండా దాడి చేసుకునేందుకే మీరంతా ఇక్కడ ఉన్నారా అంటూ సీఐ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడి చేశారని తెలుస్తోంది.

Share