బీసీలంటే బ్యాక్‌వ‌ర్డ్ క్లాస్ కాదు భార‌త‌దేశం క‌ల్చ‌ర్‌

ఏపీ టాప్ న్యూస్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏలూరులో నిర్వ‌హించిన `బీసీ గ‌ర్జన‌` స‌భ‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు వ‌రాలు ప్ర‌క‌టించారు. బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన వైయ‌స్ జ‌గ‌న్ మొద‌టి అసెంబ్లీ స‌మావేశంలోనే దానికి చ‌ట్ట‌బ‌ద్ద‌త తెస్తామ‌న్నారు. బీసీల‌కు అండ‌గాన‌ని,  ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ “బీసీలంటే బ్యాక్‌వ‌ర్డ్ క్లాస్ కాదు.. మీరు భార‌త‌దేశం క‌ల్చ‌ర్‌.  మీరంతా వెనుక‌బ‌డ్డ కులాలు కాదు.. మీరు మ‌న జాతికి వెన్నుముక లాంటివారు. మ‌నం వేసుకునే దుస్తుల ద‌గ్గ‌రి నుంచి తినే ఆహారం..ఉప‌యోగించే ప్ర‌తి పనిముట్టు, నివ‌సించే ఇల్లు.. ప్ర‌యాణించే బండి, నీరు తాగే గ్లాస్ నుంచి అన్నం తినే కంచం వ‌ర‌కు, మ‌న ఇంటి పెర‌ట్లో త‌వ్విన బావి నుంచి ఇంటికి ఉప‌యోగించిన ఇటుక వ‌ర‌కు, మ‌న బ‌ట్ట‌ల‌కు ప‌ట్టిన మ‌కిలిని వ‌దిలించ‌డం ద‌గ్గ‌ర నుంచి మ‌న వెంట్రుక‌లకు సంస్కారం నేర్ప‌డం వ‌ర‌కు.. ఇలా మ‌న ప్ర‌తి అణువులో వేల సంవ‌త్స‌రాల పాటు బీసీ కులాల పాత్ర ఎంత‌టి గొప్ప‌దో కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. “ అంటూ చెప్పుకొచ్చారు.

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ ప‌ద‌వుల్లో, నామినేష‌న్ ప‌నుల్లో ఎస్సీల‌కు, ఎస్టీల‌కు, బీసీల‌కు, మైనార్టీల‌కు 50 % రిజ‌ర్లేష‌న్లు క‌ల్పిస్తామ‌న్నారు. బీసీ సంక్షేమం కోసం ఏటా రూ.15000 కోట్ల‌కు త‌క్కువ కాకుండా ఖ‌ర్చు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు సెలూన్ షాపున్న ప్ర‌తి నాయీ బ్రాహ్మ‌ణుడికి ఏడాదికి రూ.10000లు ఇస్తామ‌న్ని హామీ ఇచ్చారు. బీసీ కులాల్లో ఉన్న 139కులాల‌కు ఒక్కొక్క కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని వైయ‌స్‌జ‌గ‌న్ చెప్పారు. మూడో వంతు నిధులు బీసీల అభివృద్ధికే కేటాయిస్తామ‌న్నారు. కులాల ఆకాంక్ష‌ల‌ను బీసీ క‌మిష‌న్‌కు అప్ప‌గిస్తామ‌ని, డిమాండ్ల పార‌ద‌ర్శ‌కంగా ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. రోడ్డుప‌క్క‌న వ్యాపారాలు చేసుకునే వారికి అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా సున్నా వ‌డ్డీకే రూ.10,000లు ఇస్తామ‌న్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న అక్కాచెల్లెమ్మల చేతుల్లో రూ.75,000 పెడతామ‌ని, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10,000, పొరపాటున ఏదైనా జరిగితే వారి కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామ‌న్నారు . అంతేకాదు వైయ‌స్ఆర్‌ బీమా కింద సాయం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తున్న‌ప్పుడు స‌భా ప్రాంగ‌ణం చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగింది. జ‌య‌హో జ‌గ‌న్ అంటూ నిన‌దించింది.

Share