టీడీపీలోకి డీఎల్‌?

ఏపీ టాప్ న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేర‌బోతున్నారా? ఈ రోజు చంద్ర‌బాబుతో భేటీ కాబోతున్నారా? మైదుకూరు నుంచి పోటీ చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే అంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు. వివ‌రాల్లోకి వెళ్లితే.. మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మొద‌ట తెలుగుదేశం పార్టీలో చేరాల‌నుకున్న చేర‌లేదు. ఆ త‌ర్వాత వైసీపీలో చేరాల‌నుకున్నారు. అయితే ఆ పార్టీ నుంచి పిలుపు రాక‌పోవ‌డంతో కొద్ది రోజులుగా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మైదుకూరు అసెంబ్లీ సీటుపై డీఎల్ కు క్లారిటీ ఇచ్చేందుకు చంద్రబాబు ఆహ్వానం పలికారని సమాచారం.
మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేద్దామని భావించారు. అప్పటికే తెలుగుదేశం టికెట్ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు క‌న్ఫామ్ అవ్వ‌డంతో చంద్రబాబు నో చెప్పారు. దీంతో ఆయన 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి ఏమ‌వుతుందో చూడాలి.

Share