రాహుల్ ఏం మాట్లాడ‌తారో?

ఏపీ టాప్ న్యూస్‌: ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు తిరుమ‌ల‌కు రానున్నారు. కాలిన‌డ‌క‌న శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈరోజు సాయంత్రం తిరుపతిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని నరేంద్ర మోదీ మాట ఇచ్చింది తిరుపతిలోనే కావడంతో ఈరోజు జరిగే సభలో ఆయన ప్రత్యేకహోదాపై ప్రకటన చేయనున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలిసంతకం చేస్తామని ఇప్పటికే చెప్పిన రాహుల్ గాంధీ విభజన హామీలపైనా స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఏపీలో కర్నూలు పర్యటన తర్వాత తిరుపతి రాహుల్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్రాన్ని విభ‌జించి ఏపీలో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెల‌వ‌కుండా భారీ మూల్యం చెల్లించుకున్న కాంగ్రెస్ ఈసారి అయినా కొన్ని స్థానాల్లో గెల‌వాల‌ని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఇది వ‌ర‌కే చెప్పినా.. ఆ విష‌యాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌నున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎక్క‌డైతే చెప్పారో.. అక్క‌డే రాహుల్ గాంధీ కూడా చెప్ప‌నున్నారు.

Share