జ‌గ‌న్ పోరాట ఫ‌లిత‌మే రైల్వే జోన్‌

ఏపీ టాప్ న్యూస్‌: కేంద్ర స‌ర్కార్ విశాఖ‌కు రైల్వే జోన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎవ‌రివారు అది త‌మ ఘ‌న‌తే అంటే కాదు..కాదు అది మా ఘ‌న‌త అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే రాష్ట్రం విడిపోయిన సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, విశాఖ‌కు రైల్వే జోన్ ఇస్తామ‌ని, ఇవే కాకుండా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అన్నింటినీ ఇస్తామ‌ని నాడు బీజేపీ చెప్పింది. అధికారంలోకి వ‌చ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ ప్ర‌క‌టించ‌లేదు. కాగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని, విశాఖ‌కు రైల్వే జోన్ ఇవ్వాలంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మొద‌టి నుంచి పోరాడుతున్నారు. ఇది ఎవ‌రు ఒప్పుకున్నా.. ఒప్పుకోక‌పోయినా నిజం. అంతేకాదు హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్‌ జగన్‌ ఎన్నో పోరాటాలు చేశారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయక ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిపక్ష నేత.. గడిచిన నాలుగున్నరేళ్లుగా హోదా, రైల్వేజోన్‌ సాధన కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరు సాగిస్తూనే ఉన్నారు. విభజన సమస్యల పరిష్కారం, హోదా కోరుతూ ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలుస్తూ వచ్చారు. ప్రతి వినతిపత్రంలోనూ రైల్వే జోన్‌ను ప్రముఖంగా ప్రస్తావించారు.
విశాఖ నుంచి శ్రీకారం చుట్టిన యువభేరీలలో హోదాతో పాటు ప్రత్యేక రైల్వే జోన్‌ వస్తే ఉత్తరాంధ్రకు కలిగే ప్రయోజనాలను యువతకు వివరించారు. రైల్వేలో ఉద్యోగాల కోసం పొరుగునున్న భువనేశ్వర్‌కు వెళ్తున్నారని, అక్కడ మన యువతను స్థానికేతరులుగా చూస్తున్నారని, జోన్‌ వస్తే మన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలొస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జోన్‌ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆ తర్వాత జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో కూడా ఉత్తరాంధ్రుల రైల్వే జోన్‌ కాంక్షపై గళమెత్తారు. ఇలా అనేక పోరాటాల ఫలితంగానే విభజన హామీల్లో ఒకటైన రైల్వే జోన్‌ను ఎట్టకేలకు కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక హోదాను కూడా సాధించగల సత్తా, సత్తువ, పోరాట స్ఫూర్తి వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉన్నాయని ఉత్తరాంధ్రవాసులు బలంగా నమ్ముతున్నారు. అలుపెరగని పోరాట యోధుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో హోదా కల కూడా నెరవేరుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

Share