వైసీపీలో చేరిక‌లే చేరిక‌లు

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చాలా మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప‌ద‌వులు, డ‌బ్బులు, ఎన్ని ఆశ చూపినా ఎవ‌రూ నిల‌బ‌డ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబుకు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. చంద్ర‌బాబు ఈ నాలుగున్న‌రేళ్లు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయ‌క‌పోగా రాష్ట్రాన్ని దోచుకు తిన్నార‌ని, ల‌క్ష‌ల కోట్లు అవినీతి సొమ్మును వెన‌కేసుకున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. అంతేకాకుండా చంద్ర‌బాబు ఎప్పుడూ మాట‌మీద నిల‌బ‌డ‌ర‌ని, చెప్పింది ఏదీ చేయ‌డ‌ని, ఈసారి ప్ర‌జ‌లే ఆయ‌న‌కు బుద్ధి చెబుతార‌ని పార్టీ మారిన వారు అంటున్నారు. అయితే ఆమంచి కృష్ణ‌మోష‌న్‌, అవంతి శ్రీ‌నివాస్‌, ర‌విబాబు, జైర‌మేష్‌, ద‌గ్గుబాటి త‌న‌యుడు ఇలా ఒక‌రి వెన‌కాల ఒక‌రు వ‌చ్చి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు కిల్లి కృపారాణి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలోకి వైయస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందని కృపారాణి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా కిల్లి కృపారాణితో పాటు సినీ నటుడు నందమూరి తారక రామారావు( జూనియర్‌ ఎన్టీఆర్‌) మామ నార్నే శ్రీనివాసరావు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గరి బంధువు. నార్నే శ్రీనివాసరావు చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ..రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ నాయకత్వం అవసరమన్నారు. ఆయన్ను ఖచ్చితంగా గెలిపించేందుకు వైయస్‌ఆర్‌సీపీలో చేరానని చెప్పారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

Share