జ‌గ‌న్‌కు జైకొడుతున్న స‌ర్వేలు

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈసారి ఫ్యాన్ గాలి కి సై`కిల్` అయ్యేట‌ట్లు క‌నిపిస్తోంది. స‌ర్వేల‌న్నీ జ‌గ‌న్‌కు జై కొడుతుండ‌డం.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిక‌లు జ‌రుగుతుండ‌డంతో ఈసారి వైసీపీకి ఎదురుండ‌ద‌నిపిస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన ఓ స‌ర్వేలో కూడా జ‌గ‌న్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. వివ‌రాల్లోకి వెళ్లితే..ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో వైసీపీకి 22 చోట్ల, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హ‌వా అంత‌గా లేద‌ని, జ‌న‌సేన పార్టీ అస‌లే లేద‌ని చెప్పింది. దీంతో వైసీపీ శ్రేణులు జోష్‌లో ఉండ‌గా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఢీలా ప‌డిపోయారు.
ఇక‌పోతే కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించినా 2014తో పోలిస్తే సుమారు 70 సీట్లు కోల్పోయే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మేజిక్‌ ఫిగర్‌ కాగా, బీజేపీ స్వతహాగా 238 చోట్ల, ఎన్డీయే కూటమి 285 సీట్లలో గెలుపొందుతుందని తెలిపింది.2014లో 282 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి 44 సీట్లను కోల్పోయి 238 స్థానాలను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. గతంలో 80 స్థానాలకే పరిమితమైన యూపీయే ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునేందుకు అవకాశాలున్నట్లు సర్వే తెలిపింది. అప్పుడు 44 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ ఈసారీ మూడంకెల స్కోరును అందుకోవడం కష్టమేనంది. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్‌ఎస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సుమారు 130 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది.

Share