డేటా అలా ఎలా ఇస్తారు?

ఏపీ టాప్ న్యూస్‌: ఆధార్ కార్డు సమాచారం వ్యక్తిగతమైనదని, దానిని రహస్యంగానే ఉంచాల్సి ఉంటుందని మజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ చెప్పారు. ఆదార్ కార్డు ఆధారంగా వేలిముద్రల టెక్నాలజీ తెలుసుకున్న కొందరు మోసాలకు పాల్పడ్డారని వెల్లడైందని ఆయన చెప్పారు. సుప్రింకోర్టు కూడా దీనిపై తీర్పు ఇచ్చిందని, దాంతో ఇది రహస్యమైన సమాచారం గా పరిగణించవలసి ఉందని ఆయన చెప్పారు. డేటా సమాచారం ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం తప్పని, అతను వ్యాపారం చేస్తూ టిడిపికి సాయం చేస్తున్నారని, ప్రభుత్వం వారు అతనికి సమాచారం బదిలీ చేసిందని, అందువల్ల ప్రభుత్వం తప్పు చేసినట్లు అయిందని ఆయన అన్నారు. ఒక వ్యక్తి సభ్యత్వానికి టీడీపీ ఆఫీస్ కు వెళితే, మొబైల్ నంబర్ ఆధారంగా వారు సభ్యత్వం ఇచ్చి, తన ఆధార్ కార్డు పోటోను కూడా తీసి సభ్యత్వం ఇచ్చారని ఒక వ్యక్తి తెలిపారని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు సమాచారం ఇవ్వడం చట్టవిరుద్దమని ఆయన అన్నారు. ఈ కేసులో టిడిపి ప్రభుత్వం ఏకంగా తెలంగాణ ప్రభుత్వంపైనే కేసు పెట్టిందని ఆయన అన్నారు.సమాచారం చోరీ జరిగిందని పిర్యాదు చేస్తే దానిపై విచారణ జరిగితే తప్పేమిటని అరుణకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే ఐటి గ్రిడ్స్ సంస్థ డైరెక్టర్ అశోక్ ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడని ఆయన అన్నారు.

Share