ఒక్కొక్క‌రుగా వ‌స్తున్నారు

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీలో ఫ్యానుగాలి జోరుగా వీస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ విధిత‌మే. ఈ గాలి నాయ‌కుల ప్ర‌జ‌ల‌వైపు మాత్ర‌మే కాదు టాలీవుడ్ స్టార్స్ వైపు కూడా బ‌లంగా వీస్తోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ముఖ న‌టుడు ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి త‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాన‌ని గ‌తంలోనే చెప్పారు. ఆ త‌ర్వాత హాస్య‌న‌టులు పృధ్వీ, కృష్ణుడు వైయ‌స్ఆర్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ప్ర‌ముఖ న‌టి జ‌య‌సుధ కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు అలీ కూడా వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఇక‌పోతే వ్యాపార వేత్త, నార్నె శ్రీ‌నివాస రావు పార్టీలో చేరారు. ఆయ‌న స్వ‌యాన జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పిల్ల‌నిచ్చిన మామ‌. ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారిని క‌లిశారు.
ఇక పోతే ప్ర‌ముఖ న‌టులు కృష్ణ‌గారు, మోహ‌న్ బాబుగారు కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌నే వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. గ‌తంలో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన కొంత‌మంది తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. కానీ ఈ సారీ వారెవ్వ‌రూ కూడా టీడీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కూ ఎటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. ఇవ‌న్నీ కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ‌లాన్ని చేకూరుస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేకులు అంటున్నారు.

Share