భూక‌బ్జాలు చేసిన వారికే టిక్కెట్లా?

ఏపీ టాప్ న్యూస్‌: భూకబ్జాలు, అక్రమాలు, అక్రమ మైనింగ్ చేసిన వారికే టీడీపీలో సీట్లు ఇస్తారా అని, నిజాయితీగా పనిచేసిన వారికి సీటు ఇవ్వరా అని కాకినాడ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణి ప్రశ్నించారు. తన భర్త అనారోగ్యంతో ఐసీయూలో ఉన్నప్పుడు సైతం టీడీపీ నుంచి ఏ ఒక్కరూ కనీసం పరామర్శించలేదన్నారు. బుధవారం వారు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ… టీడీపీలో తమకు ఘోర అవమానం జరిగిందని, సీటు ఇవ్వకున్నా కనీసం గుర్తింపు కూడా ఇవ్వకుండా నిర్లక్షం చేసిందని తోట నరసింహం పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాలకు మేలు జరిగాలంటే జగన్ వల్లే సాధ్యమన్నారు. కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తోట వాణి మాట్లాడుతూ… తమకు పదవులు ఇవ్వకున్నా కనీస భరోసా కూడా చంద్రబాబు ఇవ్వలేదని, జగన్ మాత్రం తమకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారన్నారు.

Share